




Vrm media ఖమ్మం ప్రతినిధి
భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) 2023లోని సెక్షన్ 35(3) సవరణ కోసం లోక్‌సభలో షార్ట్ నోటీసు పై మాట్లాడిన సందర్భంలో…
ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది డిలీప్ తాళ్లూరి దిలీప్ ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ అధ్యక్షుడిగా మరియు పసుపులేటి శ్రీనివాస్ ex-public ప్రాసెక్యూటర్, చేసిన వినతిపై స్పందిస్తూ, మహిళలు, పిల్లలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన కేసులను సెక్షన్ 35(3)లో మినహాయించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో తన గొంతు వినిపించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయంరెడ్డి రఘురాం రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ అంశాన్ని పార్లమెంట్‌లో వినిపించినందుకు నేడు ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాదులు, న్యాయస్థాన ప్రాంగణంలో రఘురాం రెడ్డి కి పాలాభిషేకం నిర్వహిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పసుపులేటి శ్రీనివాస్, శ్రీనివాస్ నాయుడు, వుటుకూరి విజయలక్ష్మి, సై దేశ్వరరావు, క్రిస్టఫర్, వెంకట్ నారాయణ, మిట్టపల్లి శ్రీనివాస్, దీపిక, కృష్ణారావు, ముల్సియూర్, సురేష్, ప్రవీణ్, కుంభం
రవి, లాల్ జాన్ పాషా తెల్లకుల రామారావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
– దిలీప్ తాళ్లూరి , న్యాయవాది, ఖమ్మం బార్ అసోసియేషన్
ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ అధ్యక్షుడు