ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు , నారా లోకేష్ గారికి ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి చొరవతో సిద్దవటం మండలానికి చెందిన శ్రీ అతికారి శ్రీనివాసులు గారు, అక్కిశెట్టి మణి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం పొందారు. ఈ సహాయం పొందడంలో మద్దతు ఇచ్చిన తెలుగుదేశం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారికి, పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగ ముని రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.