

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ జూలై 29
మండలంలోని మాధవరం, గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థలాన్ని సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని సోమవారం మండల కేంద్రమైన సిద్ధవటం తాసిల్దార్ ఆకుల తిరుమల బాబుకు వైద్య అధికారి డాక్టర్ శివకుమార్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ సోమవారం మాట్లాడుతూ మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థలం సుమారు 5 ఎకరాలు పైబడి ఉందని కొంతమంది స్థలాన్ని అన్యాక్రాంతం చేశారని సర్వే నెంబర్ 425 /1 శాఖరాజు పల్లి రెవిన్యూ పొలంలో హద్దులు ఏర్పాటు చేసి స్థలాన్ని నిర్ధారణ చేయాలని ఫిర్యాదు చేశామని రెండు ఎకరాలు స్థలంలో పీహెచ్ నిర్మాణం చేసి మిగతా స్థలం ఖాళీగా ఉందని కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని కజ్జా చేసి ఆసుపత్రి డెవలప్మెంట్ లేకుండా చేశారని స్థల నిర్ధారణ చేసి హద్దులు ఏర్పాటు చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిద్ధవటం మండల తాసిల్దార్ ఆకుల తిరుమల బాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డెవలప్మెంట్ చైర్మన్ సామ శ్రీనివాసులు, టిడిపి నేత బొడిచెర్ల శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు