కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 29
తెలుగు సాహిత్యంలో వందకు పైగా రచనలు చేసి ‘విశ్వం భర’తో విశ్వఖ్యా తినొందిన విశ్వకవి డా సి.నారాయణ రెడ్డి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాల కులు ఆచార్య జి.పార్వతి పేర్కొ న్నారు. సి.పి.బ్రౌన్ కేంద్రంలో మంగళవారం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా సి.నారాయణ రెడ్డి 95వ జయంతి ని ఘనంగా నిర్వహిం చారు.ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ డా సి.నారాయణ రెడ్డి పరిశోధించి రచించిన ‘ఆధుని కాంధ్ర కవి త్వం`సంప్రదాయములు, ప్రయోగ ములు’ అనే గ్రంథం గొప్ప ప్రామా ణిక గ్రంథంగా సాహితీ చరి త్రలో నిలిచిపోయిందని అన్నారు.