Home ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటలలో ఈ క్రాప్ బుకింగ్పంట భీమా పై క్షేత్ర స్థాయి పరిశీలనఉద్యాన అధికారి – జయ భరత్ రెడ్డి

ఉద్యాన పంటలలో ఈ క్రాప్ బుకింగ్పంట భీమా పై క్షేత్ర స్థాయి పరిశీలనఉద్యాన అధికారి – జయ భరత్ రెడ్డి

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 29

సిద్ధవటం మండలంలోని భాకరాపేట, నేకనాపురం, మాధవరం, సిద్ధవటం గ్రామాలలో ఈ పంట మొదలయింది మండల పరిధిలోని రైతు భరోసా కేంద్రాలలో ఉన్న రైతు సేవ కేంద్ర సిబ్బందికి ఉద్యాన అధికారి జయ భరత్ రెడ్డి ఉద్యాన పంటలలో పంట నమోదు పై అవగాహన కల్పించారు. ఈ క్రాప్ యాప్ లో ఉద్యాన పంటలైన మామిడి, చీని, నిమ్మ, అరటి, పసుపు, చామంతి తదితర పంటలను రైతు సోదరులు తప్పనిసరిగా ఈ పంట లో నమోదు చేసుకోవాలని తెలియచేసారు. ప్రతి రైతు భరోసా కేంద్ర సిబ్బంది ప్రతి రోజు తప్పనిసరిగా 50 ఎకరాలు పంట నమోదు చేయాలనీ ఆదేశించడమైంది. ఈ కార్యక్రమంలో రైతు సేవా సిబ్బంది పాల్గొన్నారు.
PMFBY కింద పసుపు, ఉల్లి పంటలకు భీమా వర్తింపు
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కింద పసుపు మరియు ఉల్లి పంటలకు భీమా కోసం ప్రీమియం చెల్లించుటకు జులై 31 2025 ఆఖరు తేదీ అని తెలియచేసారు. పసుపు పంటకు ఎకరాకు 180 రూపాయలు, ఉల్లి పంటకు ఎకరాకు 90 రూపాయలు చెల్లిస్తే పసుపుకు భీమా మొత్తం 225000 రూపాయలు మరియు ఉల్లికి భీమా మొత్తం 112500 రూపాయలు వర్తిస్తుందని తెలియచేసారు.పసుపు రైతులందరూ మీ సేవ కేంద్రాలలో భీమా కొరకు జులై 31 2025 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియచేసారు.

2,816 Views

You may also like

Leave a Comment