

ఒంటిమిట్ట VRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి జూలై 29
ఒంటిమిట్ట మండల వ్యాప్తంగా 45 రోజులపాటు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించి మండలంలోని ప్రతి ఇంటికి జనసేన పార్టీని తీసుకెళ్లానని ఒంటిమిట్ట మండలంలో బీసీల ఓట్లు ఎక్కువ అందులో తన సొంత సామాజిక వర్గమైన పద్మశాలి కులస్తుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని వారందరీ మద్దతు తనకు ఉందని కావున జనసేన పార్టీ తరఫున ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికకు పోటీ చేస్తున్నానని దీనికి పార్టీ పెద్దలు సహకరించాలని కోరుకుంటున్నారు.కడప జిల్లాలో ఒంటిమిట్ట మండలానికి ఒక ప్రత్యేకత ఉందని కడప జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో రెడ్ల నాయకత్వంలో ఉంటే ఒంటిమిట్ట మండలంలోని మెజారిటీ అంటే మెజారిటీ గ్రామపంచాయతీలు బీసీల నాయకత్వంలో బీసీలు సర్పంచులుగా ఎంపిటిసిలుగా ఉన్న ప్రత్యేకమైన మండలం కాబట్టి బీసీ నైనా తనకు కచ్చితంగా ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు.కావున జనసేన పార్టీ పెద్దలు దీనికి సహకరించాలని ఒక ప్రకటనలో రాటాల రామయ్య తెలిపారు.