

కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 29
జీవితంలో తాను ఎంచు కున్న గమ్యాన్ని చేరుకోవాలంటే దీక్ష, కృషి, పట్టుదల,క్రమశిక్షణల తో పాటు సంకల్ప బలం ఉండాలని వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. మంగళ వారం కడప ఎస్ కె ఆర్ అండ్ ఎస్ కె ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంగ్ల శాఖ ఆధ్వ ర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహిం చారు.ఇం దులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మూల మల్లికా ర్జున రెడ్డి ప్రసంగించారు.తన వీధి బడి చదువు నుండి విశ్వవి ద్యా లయ ఆచార్యుల వరకు ఎదిగిన వైనాన్ని చెబుతూ తన బాల్య మంతా అపజయాల పరంప రేనని, వివాహ సమయానికి డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయానని చెప్పా రు.