


నంద్యాలVRM న్యూస్ ప్రతినిధి జూలై 29
నంద్యాలలోని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండవ రోజు నంద్యాలలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సౌజన్య ఫంక్షన్ హాల్ లో నంద్యాల జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారు రాయలసీమ జోనల్ ఇన్చార్జి బిట్రా వెంకట శివ నారాయణ గారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడుతూ విక్షిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న సందర్భంలో ప్రతి కార్యకర్త కూడా దానికి సారథ్యం వహించే విధంగా కార్యకర్తలను కార్యవర్గలుగా ముందుకు సాగిస్తూ ప్రతి గడపకు బిజెపిని తీసుకెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకునే దానికి పార్టీ నాయకులు కార్యకర్తలు తయారుగా ఉండాలని వారు సూచించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కోలాటాలు గుర్రాల స్వారి వంటల సఫారీ తో పెద్ద ఎత్తున ర్యాలీ అనంతరం సభ పెద్ద ఎత్తున జరిగినది ఈ కార్యక్రమంలో వేలాదిగా స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలివచ్చారు