Home ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

ట్రైబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

by VRM Media
0 comments

లబ్ధిదారులకు అందజేసిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్

హుకుంపేట (అల్లూరి జిల్లా)
న్యూస్ : VRM Midea

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ బిర్జాపల్లి గ్రామంలో ఆదివాసీ వెల్ఫేర్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం కు జాయింట్ కలెక్టర్ మరియు ఇన్చార్జి పి ఓ అయినటువంటి అభిషేక్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా గ్రామాల గిరిజనులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పిఓ అభిషేక్ గౌడ్ చేతులు మీదుగా న్యూ లైఫ్ సూయింగ్ ద్వారా టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ ఛార్జ్ పిఓ అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ ఇంతా మంచి కార్యక్రమంకు నన్ను ఆహ్వానించిన ట్రైబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి మరియు గ్రామస్తులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ నేడు ఈ గ్రామంలో ఈ ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్లు మిషన్ ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం అని, వీటిని సద్వినియోగం చేసుకొని మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ ప్రభుత్వం నుండి కూడా ఈ శిక్షణ పొందిన వారికి రుణాలు అందేలా చేయడం ఖాయమని ముఖ్యంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ చేసే ప్రతి కార్యక్రమాలకు ఎల్లవేళలా మా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అయినటువంటి మహిళలు మాట్లాడుతూ గతంలో మేము శిక్షణ తీసుకున్నా అనంతరం ఒక మహిళ మీకు కుట్టుమిషన్లు ఇస్తానని మా దగ్గర కొంత డబ్బులు వసూలు చేసి అనంతరం మాకు ఇవ్వకుండా మోసం చేయడంతో చాలా కృంగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలెగ్జాండర్ వర్యులకు మేము ఇలా మోసపోయమని తెలియజేయగానే నా వంతు నేను సహాయం చేస్తానని ఆనాడు మాట ఇచ్చి ఈరోజు శిక్షణ పొందిన 26 మందికి రూపాయి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని, తప్పకుండా ఆయన మా ఎదుగుదలకు సహాయం చేసినందుకుగాను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేసిన సహాయం వొమ్ము చేయకుండా మేమంతా ఆర్థికంగా ఎదిగి మా కుటుంబాలను చక్కగా చూసుకుంటూ మా పిల్లలను చక్కగా చదివించుకుంటామని తెలుపుతూ,అలాగే రాబోయే రోజుల్లో ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలెగ్జాండర్ విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఏది ఏమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో ఇంత అధిక మొత్తంలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో నిజంగా ఈ కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమం అని పలువురు ట్రైబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలెగ్జాండర్ మరియు వారి కుటుంబీకులకు స్థానిక ప్రజలందరూ అభినందనలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పంచాయతీ మాజీ సర్పంచ్ కామేశ్వరరావు పాస్టర్లు ఎలీషా, మోసే, మత్స్యరాజు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

2,811 Views

You may also like

Leave a Comment