సిద్ధవటంVRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 30
పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి చొరవతో, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గంలో ‘సూపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దవటం మండలం టక్కోలు గ్రామంలోని హరిజనవాడలో ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత నాయకులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు చురుకుగా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించడంలో ప్రతి ఒక్క కార్యకర్త విలువైన పాత్ర పోషిస్తున్నారు. వారి నిబద్ధతకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి టీడీపీ నాయకులు శంకర, షబయ్య, సుబ్బయ్య, శీను తదితరులు పాల్గొని కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird