కడప ఎడ్యుకేషన్ (VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 30
విప్లవ వీరుడు నక్సల్ బరి భూస్వామ్య వ్యతిరేక పోరాట ధీరుడు కామ్రేడ్ చారు మజుందర్ 53వ వర్ధంతిని పరి ష్కరించుకొని కడప వై జంక్షన్ లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళు లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బందెల ఓబయ్య మాట్లాడుతూ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, పీడిత వర్గ ప్రయో జనం కోసం అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన నిలబడిన కమ్యూ నిస్టు ఉద్యమకారుడు చారు మజందర్ అని పేర్కొన్నారు. అలాగే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ వ్యవస్థాపకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని తెలిపా రు. ఏ ప్రాంతంలో పనిచేసిన ప్రజాప్రయోజనాలే ముఖ్యముగా పనిచేస్తూ జీవితమంతా ఉద్యమా లకు అంకితం చేసిన విప్లవ కారుడనీ కొనియాడారు. ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా లిబరేషన్ కమ్యూనిస్టు ఉద్య మాలలో మొదటి స్థానం నిలబ డడానికి చారు మజుం దార్ పోరాట ఫలితమేనని అన్నారు.నేడు బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్టు విధానానికి వ్యతిరేకంగా తమ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ తలపెట్టే భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలకు చ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంవి రమణ, బి ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird