
Vrm media ప్రతినిధి హైదరాబాద్

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయని పోస్టులని భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణలోని కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ బోర్డుల్లో డైరెక్టర్లు, మెంబర్ల నియామకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈరోజు(బుధవారం) సీఎం రేవంత్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జీ మీనాక్షీ నటరాజన్ భేటీ కానున్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఆశావహుల పేర్లను సిపారసు చేశారు పార్టీ బాధ్యులు. జిల్లా ఇన్‌చార్జీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీలు ఇచ్చిన నివేదికలను టీపీసీసీ చీఫ్, పార్టీ ఇన్‌చార్జీ అందుకున్నారు. నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్ల లోపు వారికే 60 శాతం పదవులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇవాళో, రేపో లిస్ట్ రేవంత్ ప్రభుత్వం విడుదల చేయనుంది..