Home వార్తలుఖమ్మం గోకవరం గ్రామ శాఖ అధ్యక్షులుగా వినోద్ కుమార్కార్యదర్శిగా గుగులోత్ నాగేశ్వరరావు

గోకవరం గ్రామ శాఖ అధ్యక్షులుగా వినోద్ కుమార్కార్యదర్శిగా గుగులోత్ నాగేశ్వరరావు

by VRM Media
0 comments


కల్లూరు జులై30(VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ ):

కల్లూరు మండలం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహిస్తున్నారు. గోకవరం గ్రామపంచాయతీ గ్రామ శాఖ ఎన్నికలు మంగళవారం గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి రామారావు, కాసియా, నల్లగట్ల జములయ్య, విజయనిర్మల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ధర్మసోత్ వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా లకావత్ కృష్ణ, కార్యదర్శిగా గుగులోతు నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా గుగులోతు సీతారాం, కోశాధికారిగా మారుతి కృష్ణ, కార్యవర్గ సభ్యులుగా 20 మందిని ఎన్నుకోశాఖ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి సీటు ఇచ్చిన వారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

2,857 Views

You may also like

Leave a Comment