క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
కడప అంబేద్కర్ సర్కిల్లో ఆందోళన
కడప ఎర్రముక్కుపల్లె (VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ) జులై
30: నగరంలో కబ్జా దారుల చేతిలో ఉన్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అఖిల పక్ష పార్టీల ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు, స్థలాలను ప్రైవేటు వ్యక్తుల కబ్జాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో రెవెన్యూ కార్పొరేషన్ యంత్రాంగం ఘోరంగా విఫలమైం దని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ సర్కిల్లో ఆందోళన చేపట్టారు.ఈ సంద ర్భంగా అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఎ .రామమోహన్, ఎస్ఎ సత్తార్, ఓబయ్య, మగ్బుల్ బాషా, రమణయ్య, డబ్ల్యూ రాము, సుబ్బరాయుడు, నాగేం ద్రకుమార్ లు మాట్లాడుతూ కడప నగరంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికా ర యంత్రాంగం సహకరిస్తున్నారని ఆయన ఆన్నారు. తక్షణమే ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న భూ కబ్జాదారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.కడప నగరంలో దాదాపు 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో బదలా యింపు జరిగిందని, దీని మీద సమగ్ర విచారణ జరిపించా లని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశల వారి ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు.అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు దస్తగిరిరెడ్డి, అన్వేష్, కుమారస్వామి రెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు నరసింహ గోవిందు రామకృష్ణారెడ్డి రసూల్ జకరయ్య, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి మక్బూల్ భాష, కార్యదర్శివర్గ సభ్యులు చాపల సుబ్బరాయుడు, మహిళా సంఘం నాయకులు తస్లీమ్, లక్ష్మీదేవి, ఆప్ కి ఆవాజ్ నగర అధ్యక్షులు ఆబిద్ హుస్సేన్ , దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం నాయకులు రవి, ఓబులేష్, చిన్న సుబ్బయ్య, శంకరయ్య, వెంకటేష్, జార్జి, లక్ష్మీదేవి, జమీల సునీత తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird