

డా. చింతకుంట శివారెడ్డి
కడప కల్చరల్ (VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ) జులై 30: రాయలసీమ మాండ లికాన్ని కథల్లో చొప్పించి ప్రాంతీయ భాషకు జీవంపోసిన కథకుడు ‘పులికంటి కృష్ణారెడ్డి’ అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. చింత కుంట శివారెడ్డి అన్నారు. యోగివే మన విశ్వవిద్యాలయం ఆధ్వ ర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశో ధన కేంద్రం బుధవారం డా పులి కంటి కృష్ణారెడ్డి 95వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముందుగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఉద్యోగులు, పాఠకులు కలసి డా పులికంటి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం డా చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాం తీయ అస్తిత్వం దిశగా రచనలు చేసి, రాయలసీమ సిన్నోడుగా చెప్పుకున్న కవి, కథకుడు డా పులికంటి కృష్ణారెడ్డి అని పేర్కొ న్నారు. పులికంటి రాయలసీమ జానపద శైలిలో ‘అమ్మిపదాలు’ అనే పేరుతో 43 పాటలు రాశా రన్నారు. కవిగా, కథకుడుగా, రంగస్థల నటుడుగా, బుర్రకథ కళాకారుడుగా పులికంటి సుప్ర సిద్ధులన్నారు. మధురాంతకం రాజారాం ప్రేరణతో పులికంటి ‘గూటికోసం గువ్వలు’ అనే కథతో కథారచనకు శ్రీకారం చుట్టార న్నారు. ఆయన కథలు గూటికోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని వంటి కథాసంపు టాలుగా వెలువడ్డాయని, దాదాపు 200 కథలు రచించారన్నారు. పులికంటి కథల్లో రాయలసీమ జీవితం కనబడుతుందన్నారు. గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేష్‌రావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పులికం టి జీవించారని, అందువల్లనే ఆయన అందరి మన్ననలందు కున్నారన్నారు. దళిత కథాసంపు టిని వెలువరించడం ఆయనకు దళితులతో ఉన్న అనుబంధానికి తార్కాణమన్నారు. ఆయన సాహితీకృషిని గుర్తించి శ్రీవేంక టేశ్వర విశ్వవిద్యాలయం 2005లో ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిందన్నారు.ఈ కార్య క్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం జూనియర్ అసిస్టెంట్ ఆర్.వెంకటరమణ, సిబ్బంది, పాఠకులుమోహన్ రెడ్డి, నాగబాబు,లోకేష్, తేజేశ్వర్, నాగేంద్ర పాల్గొన్నారు.