

కడప వైవీ యూ( VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పీ ఈశ్వర్) జులై 30: యోగి వేమన విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర పరిశోధకురాలు షేక్. సుల్తానా కు డాక్టరేట్ నువై.వి.యు డాక్టరేట్ ప్రకటించింది. రసాయన శాస్త్ర శాఖ ఆచార్యులు ఎన్.సి. గంగిరెడ్డి పర్యవేక్షణలో “ డి.పై.ఎ.టైప్ స్మాల్ ఆర్గానిక్ మాలిక్యుల్స్ ఫర్ ఆప్టో ఎలక్ట్రానిక్ అప్లికేషన్”అనే అంశం పైన పరిశోధన చేసి రూపొందించిన సిద్ధాంత గ్రంథాన్ని విద్యాలయ పరీక్షల విభాగానికి సమర్పించారు. ఉపకులపతి మార్గదర్శకంలో నియమితులైన నిపుణుల బృందం పరిశోధన గ్రంధాన్ని పరిశీలించి డాక్టరేట్ కు అర్హత ఉన్నట్లు ప్రకటిం చారు. ఈ మేరకు వై.వి.యు పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కె.ఎస్వీ. కృష్ణారావు డాక్టరేట్ నోటిఫికేషన్ జారీ చేశారు. షేక్ సుల్తానా రాసిన 8 పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించారు. డాక్టరేట్ అందుకున్న షేక్ సుల్తానాను వై వి యు వి సి ఆచార్య అల్లం శ్రీనివా సరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ , ప్రిన్సిపల్ ఆచార్య టి. శ్రీనివాస్, రసాయన శాస్త్ర శాఖ అధ్యాపకులు విద్యార్థులు అభినందించారు.