


సిద్ధవటంVRM న్యూస్ లక్ష్మీనారాయణ జూలై 30
సిద్ధవటం మండలం, టక్కోలు:
టక్కోలు గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో “సూపరిపాలన తొలి అడుగు” డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం రెండొవ రోజున ఘనంగా నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి గత ఒక సంవత్సర కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అభ్యున్నతి కోసం రూపొందించిన ప్రణాళికలను సైతం ప్రజలకు వివరించారు. కార్యక్రమం భాగంగా ప్రజల ప్రాథమిక సమస్యలు, అవసరాలను నమోదు చేయడం కూడా జరిగింది.
ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పలువురు ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, శంకర్, రవి, రమణ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.