

ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు,విద్యార్థులు, ప్రజాప్రతినిధులు
హుకుంపేట (అల్లూరి జిల్లా) న్యూస్ : VRM Midea
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు ఉబ్బేటి. నారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా విద్యార్థులు పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఉబ్బేటి.నారాయణ విశిష్ట సేవలందించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అభ్యసించి విద్యా ప్రదాతగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని, ముఖ్యంగా మంచికి మారుపేరుగా అందరి మన్ననలు పొందిన ఉపాధ్యాయులు ఉబ్బేటి.నారాయణ అందరికీ మార్గదర్శిగా నిలిచిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మానవ జీవితంలో మనం చేసే పని చేయాల్సిన పని సమయంకే చేయాలి క్రమం తప్పకుండా సమయం పాటించాలి అని, సమయం చాలా గొప్పదని మన పెద్దలు అంటుంటారు. ఆ విషయంలో మన ఉపాధ్యాయులు ఉబ్బేటి. నారాయణ మొదటి వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఎందుకంటే ఆయన విధులు నిర్వహించిన ఇన్ని సంవత్సరాలలో ప్రతిరోజు పాఠశాలకు సమయానికి వచ్చి విద్యార్థులకు విద్యనభ్యసించే వారని అంతేకాకుండా విద్యార్థులకు కావలసినటువంటి పెన్నులు,పుస్తకాలు కూడా ఉచితంగా అందజేసేవారు, ముఖ్యంగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే ఆయన సొంత డబ్బులతో వైద్యం చేయించి వారి బాగోగులు చూసుకునే ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమం కు హాజరైన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబీకులు ఆయన దగ్గర విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆయనకు పూలమాలలు వేసి దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ప్రతి ఉపాధ్యాయులు ఉద్యోగ రీత్యా పదవి విరమణ అవ్వడం తప్పనిసరి అయినప్పటికీ ఒక గొప్ప ఉపాధ్యాయుడు మాకు ఇక విద్యనభ్యసించారు అనే ఆలోచన చాలా బాధాకరంగా ఉందని విద్యార్థులు కన్నీటిపర్యం అయ్యారు.