

సిద్దవటం VRM న్యూస్ మౌలాలి జూలై 30
ఒంటిమిట్ట మండల జడ్పీటీసీ స్దానం ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాద్ రెడ్డి రాజీనామా చెయ్యడంతో ఖాళీ ఏర్పడింది.ఆ స్దానాన్ని భర్తీ చేయుటకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉప ఎన్నిక హడావుడి మెుదలైంది.అందులో భాగంగా బుధవారం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన రాటాల రామయ్య కడపలోని జడ్పీ కార్యాలయంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానానికి అట్టహాసంగా వీరమహిళలు, కార్యకర్తలు,నాయకులతో జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేశారు. నామినేషన్ అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుండి వీరమహిళలు అభిమానులు కార్యకర్తల నడుమ బ్యాండు భాజాలతో ర్యాలీగా లక్ష్మిరంగ సర్కిల్ వరకు నడుచుకుంటూ వెళ్ళారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.