Home ఆంధ్రప్రదేశ్ తక్షణమే అధికారులు స్పందించి ముసురు మిల్లి కాలువకు పూడిక తీసి దేవారం,శరభ వరం పంచాయతీల భూములకు సాగునీరు అందించాలి.ఏపీ ఆదివాసీ జేఏసీ.

తక్షణమే అధికారులు స్పందించి ముసురు మిల్లి కాలువకు పూడిక తీసి దేవారం,శరభ వరం పంచాయతీల భూములకు సాగునీరు అందించాలి.ఏపీ ఆదివాసీ జేఏసీ.

by VRM Media
0 comments

సకాలంలో నీళ్లు లేక నేటికీ ఊడుపులు వెయ్యని రైతులు.

ముసురు మిల్లి ప్రాజక్టు కాలువ లో ఉన్న ఊద గడ్డి,గుర్రపు డెక్క ను శ్రమదానంతో తొలగిస్తున్న రైతులు.

దేవీ పట్నం, జూలై 31.VRM Midea దుర్గా ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండల పరిధిలోని దేవారం,శరభ వరం పంచాయతీల భూములకు ముసురు మిల్లి ప్రాజక్టు కాలువ కు పూడిక తీసి తద్వారా సాగునీరు యుద్ధప్రాతిపదికన అందించి వరి ఊడుపులు వేసే విధంగా అధికారులు,ప్రజా ప్రతినిధులను చర్యలు తీసుకోవాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ విజ్ఞప్తి చేశారు.నిన్నటి నుంచి దేవారం,కమలం పాలెం గ్రామాలకు చెందిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముసురు మిల్లి ప్రాజక్టు కాలువ లో ఉన్న ఉదార గడ్డి, గుర్రపు డెక్క శ్రమదానం చేసి తొలగిస్తున్నారు.అయిన ముసురు మిల్లి ప్రాజక్టు కాలువ ద్వారా నీళ్లు రైతుల భూములలోకి రాక పోవడంతో ఒక వైపు వరి అకు మడులు ఎండి పోతున్నాయన్నారు.మరో వైపు ఆగస్టు నెల వచ్చినప్పటికీ నేటికి వరి ఊడుపులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నరన్నారు.వాస్తవానికి ఈ ముసురు మిల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సుమారు 22 వేల 316 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో నిర్మించారన్నారు.ఈ నేపథ్యంలో ఫసల బీమా పథకం మార్గదర్శకాల ప్రకారం వానకాలం మొత్తం ప్రీమియం లో రైతు వాటా కింద రెండు శాతం,యాసంగిలో 1.5 శాతం,వాణిజ్య ఉద్యాన పంటలకు ఐదు శాతం సాగునీరు అందించాలన్నారు.కానీ దేవారం శరభ వరం గ్రామ పంచాయతీల రైతులకు ఉన్న సుమారు ఐదు వేల ఎకరాల భూములకు ముసురు మిల్లి ఇరిగేషన్ ప్రాజక్టు కాలువ ద్వారా నీళ్లు సకాలంలో రాకపోవడంతో సార్వా వరి పంటకు నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు.ఇది ముసురు మిల్లి ప్రాజక్టు అధికారుల కృత్రిమ సృష్టి కారణం అవ్వుతుందన్నారు.మరోవైపు వర్షాలు సకాలంలో కురవక పోవడంతో వరి ఆకు మడులు ఎండి పోతున్నాయాన్నారు.ఈ సంవత్సరం ముసురు మిల్లి ప్రాజక్టు నుండి కాలువ పూడిక తీత సుమారు 16 కిలో మీటర్లు వరకు మాత్రమే తీశారు.ఇంక సుమారు 18 కిలో మీటర్లు కాలువ పూడిక తీత తీయలేదన్నారు.ముసురు మిల్లి ప్రాజక్టు కాలువ పూడిక తీసి దేవారం,శరభ వరం పంచాయతీల భూములకు సాగునీరు అందించాలని గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం కి,అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కి,రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవికి వినతి పత్రాలు అందజేశాము.కానీ దేవారం,శరభ వరం పంచాయతీల భూములకు నేటికీ సాగునీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోలేదన్నారు.ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు,రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి తక్షణమే స్పందించి మిగిలిన 18 కిలో మీటర్లు ముసురు మిల్లి కాలువ లో పూడిక తీసి సక్రమంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2,818 Views

You may also like

Leave a Comment