

సిద్దవటం VRM న్యూస్
సిద్ధవటం మండలంలోని ప్రజల చిరకాల వాంఛ అయిన మాచుపల్లి టు ఖాదర్ బంగ్లా బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతులు మీదుగా శంకుస్థాపన చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎటువంటి కార్యకలాపాలను నోచుకోని బ్రిడ్జిని త్వరితగతిన నిర్మాణం పనులు చేపట్టి, పాదయాత్రలో మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాజంపేట సభలో స్వయాన ఇచ్చిన వాగ్దానంను నెరవేర్చాలని ఒంటిమిట్ట మండలంలోకి వచ్చిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు, అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిని కలిసి సిద్ధవటం ప్రజల చిరకాల ఆకాంక్షను తీర్చ వలసిందిగా విన్నవించుకున్నారు అనంతరం మంత్రి గారికి శాలువా తో సత్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిద్దవటం మండల అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, మండల క్లస్టర్ ఇంచార్జి దారపునేని దశరథ రామానాయుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వాహన కార్యదర్శి కాడే శ్రీనివాసులు నాయుడు, భాకరాపేట సర్పంచ్ ప్రతినిధ