Home ఆంధ్రప్రదేశ్ వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గా ఏ కుల రాజేశ్వరి రెడ్డి సిద్ధవటం..

వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గా ఏ కుల రాజేశ్వరి రెడ్డి సిద్ధవటం..

by VRM Media
0 comments

సిద్ధవటం మండలానికి,(రాజంపేట నియోజకవర్గం) చెందిన , వైయస్సార్సీపి సీనియర్ మహిళా నేత ఏకుల రాజేశ్వరి రెడ్డి ని వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వైయస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కమిటీ నుంచి నియామక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనకు రాష్ట్రస్థాయిలో పదవి రావడానికి ముఖ్యకారకులు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి , రాజంపేట ఎంపి పి వీ మిథున్ రెడ్డి , వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి సహకారం కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన ఈ పదవికి న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. మహిళల సమస్యలపై వైఎస్ఆర్సిపి తరఫున తాను ఎటువంటి ఉద్యమానికైనా, పోరాటానికైనా సిద్ధమనేని తెలిపారు. మహిళలకు అండగా ఉంటూ వారికి సేవలు చేసుకునే భాగ్యం పార్టీ తరఫున కల్పించినందుకు వైయస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా రుణపడి ఉంటానన్నారు.

2,856 Views

You may also like

Leave a Comment