Vrm media ontimitta bala moulali.

🟢 పట్టువదలని యువనేత
🟢 తెదేపా నేతలతో సుదీర్ఘ మంతనాలు
🟢 ఏకగ్రీవం ఇక లాంచనమే
🟢 ఒంటిమిట్టలో ఊపందుకున్న రాజకీయం
ఏడాదిపాటు కాలవ్యవధి.. అయినా సరే జడ్పీటీసీ సభ్యునిగా కొనసాగాలన్న తపన.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడులా కార్యకర్తల అండదండలతో ముందడుగు వేసి.. పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని.. నేతల మనసు గెలుచుకొని.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని శభాష్ అనిపించుకొన్న ఆర్ఆర్ఆర్ జడ్పీటీసీ రేసులో వున్నట్లు.. ఏకగ్రీవం ఇక లాంచనమే అన్నట్లు.. ఊహగానాలు వెలువడుతున్నాయి. జడ్పీటీసీ రేసులో ఆర్ఆర్ఆర్ పేరు తెరపైకి రావడంతో ఒంటిమిట్ట మండలంలో రాజకీయం ఊపందుకుంది. తెరమరుగున పడ్డ ఈ అంశం నేడు హాట్ టాపిక్ గా మారింది. మూడు సంవత్సరాలుగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో కొనసాగి.. రాష్ట్రంలో ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అన్నమయ్య జిల్లాలోని రాజంపేట వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభ్యునిగా గెలుపొందిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యత్వానికి కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు తన రాజీనామా పత్రాన్ని అందజేసిన విషయం పాఠకులకు విధితమే. ఖాళీ ఏర్పడ్డ ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడి స్థానంలో ఎన్నిక కాబడాలని ఒంటిమిట్ట మండల తెదేపా నాయకులు ఎవరికి వారు ప్రయత్నం చేశారు. పార్టీ పెద్దలతో మతనాలు జరిపి ఎలాగైనా ఏకగ్రీవంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడుగా ఎన్నిక కావాలని పావులు కదిపిన వారిలో కార్యదీక్షుడిగా గుర్తింపు పొంది ప్రజా సేవకుడుగా పేరొందిన ఒంటిమిట్ట మండల యువనేత ఆర్ఆర్ఆర్ (దున్నూతల రఘురామ్ రెడ్డి) ఒకరు. అనుకున్నదే తడవుగా తమ మద్దతుదారులు అభిమాన కార్యకర్తలతో కడప జిల్లా తెదేపా నేతలను కలసి మంతనాలు జరిపి తనకు అనుకూలంగా అధిష్టానం ముందు ప్రతిపాదించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ "మేడా" వర్గీయుడిగా గత ప్రభుత్వంలో క్రియాశీలక నేతగా వ్యవహరించి ప్రజా మన్ననలు పొంది మండలంలో మంచి పట్టు సాధించారు. "మేడా" ఆదేశానుసారం తెదేపాలో చేరి కూటమి సభ్యులతో కలిసి అదే ఊపులో పార్టీ కోసం నిస్పక్షపాతంగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. కొందరి చౌకబారు రాజకీయం కారణంగా రాజంపేటలో తమ పార్టీ ఓడినందుకు లోలోన మదనపడినా.. రాష్ట్ర వ్యాప్తంగా అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో సంతోషపడి, పార్టీ పెద్దలను కలిసి అభినందనలు తెలుపుతూ, పార్టీ కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నికలలో గెలిచిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ముందుకు కదలారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడిగా బరిలో నిలిచి గెలుపొందాలని ఆర్ఆర్ఆర్ ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు పల్లెపల్లెకు చేరవేయు క్రమంలో ఈ అంశంపై అధిష్టానం దృష్టిసారించలేదు. తిరిగి ఈ అంశం తెరపైకి రావడంతో దున్నూతల రఘురాం రెడ్డి అప్రమత్తమయ్యారు. ఏది ఏమైనప్పటికీ గత అనుభవంతో పార్టీ పెద్దల సూచనలు సలహాలు మేరకు ఎలాగైనా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలన్న దృక్పథంతో ఒంటిమిట్ట మండలానికి చెందిన దున్నూతల రఘురామ్ రెడ్డి (ఆర్ఆర్ఆర్) పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆర్ఆర్ఆర్ కదలికతో ఒంటిమిట్ట రాజకీయం వేడెక్కింది. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి కూడా జడ్పీటీసీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయనకు ఒంటిమిట్ట మండల తెదేపా నాయకులు కొందరు మద్దతు తెలిపినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయినప్పటికీ తెలుగుదేశంపార్టీ పెద్దలు తనకే మద్దతు ఇస్తారన్న ఆశా దృక్పథంతో ఆర్ఆర్ఆర్ ఆట మొదలెట్టారు. రాజంపేటలోని "మేడా" వర్గాన్ని తెదేపాలో చేర్చేందుకు "మేడా" ఆదేశానుసారం ముందుగా ఆట మొదలెట్టి ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయ్యారు. కూటమి కొలువులో ప్రధాన భూమిక పోషించారు కూడా. అదృష్టం కలిసొస్తే కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యుడుగా తనదైన శైలిలో కాలు పెట్టాలని కడప జిల్లా తెదేపా నేతలతో కలసి ఆర్ఆర్ఆర్ ఆశా దృక్పథంతో ముందడుగు వేయడం ఒంటిమిట్ట మండలంలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశంపార్టీ పెద్దలు యువనేతకు పట్టం కడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird