

దేవీపట్నం ప్రెస్ నోట్ :VRM media దుర్గా ప్రసాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.రామన్నపాలెం లో సుమారు నలభై ఎకరాల్లో ఈరోజు రైతులకు జీడిమామిడి మొక్కలు మండల ఎంపీడీఓ ముఖ్య అతిథిగా ఎన్.ఆర్.జి.ఎస్ ఏ.పి.ఒ అధ్యక్షతన నాలుగు పంచాయితీ ల సర్పంచులు ఎంపీటీసీలు కూటమి నాయకులు పాల్గొనగా రైతుల సమస్యలపైన గ్రామస్థులు ఎంపీడీఓ తెలియచేయటం జరిగింది… అలానే సంవత్సరానికి ప్రతి ఎకరానికి ప్రభుత్వంచే 70వవేల రుపాయలను మొక్కలకు వ్యాచ్చించటం జరిగిందని ఎరువులు కొనుగోలులో బిల్లు ద్వారా రైతులకు నగదు చెల్లించటం జరుగుతుందని రైతులకు వివరించటం జరిగింది… రైతులు ఐదుగురు రైతులకు కలిపి ఒక బోరును ఏర్పాటు చెయ్యాలని కోరగా దానిని త్వరలోనే అధికారుల దృష్టిలో పెడతామణి తెలియచేసారు. రాయుడు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కొత్త ఆలోచనలతో రైతులకు మీతో మేమున్నాం అంటూ పథకాలు పెడుతుంది డిప్యూటీ సియం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక దృష్టిపెట్టి గిరిజన గ్రామాలు గ్రామీణ అభివృద్ధి పర్యావరణం పరిరక్షణ విద్య వైద్యం రహదారులు లేని గ్రామాలకు రహదారి రూపాకల్పనా చేస్తున్నారని.ప్రతి ఒక్క గిరిజన గ్రామం ఆదర్శంగా తీర్చి దిద్దితారని తెలియచేస్తూ ఎన్.ఆర్.జి.ఎస్ ఏపిఒ రైతులకు నెల లేదా రెండు నెలలకు ఒకసారి పంట మీద జీడిమామిడి మరి ఇతర పంటలకు ఎంత మోతాదులో వాడాలి పంటను ఎలా వాడాలి ఏం వాడాలి అధిక దిగుబడిని ఎలా పొందాలానే ఎవర్నెస్ ప్రోగ్రాం ని కండక్ట్ చెయ్యాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జనసేన మండల సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం, మట్టా సందీప్ నాయుడు పాల్గొనటం జరిగింది.