Home ఆంధ్రప్రదేశ్ Pకోరుకొండ జూనియర్ కాలేజీ లో మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

Pకోరుకొండ జూనియర్ కాలేజీ లో మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

by VRM Media
0 comments

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గార్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థులలో నైపుణ్యం పెంచడానికి , సృజనాత్మకత పెంచడానికి, విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి ఈ మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేసిందని, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యార్థులకు కిట్ను పంపిణీ చేసిందని, చదువుకున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయలు జమ చేశారని, పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలు కనబరిచిన వారిని గుర్తించి సైనింగ్ అవార్డులు పేరిట సత్కరించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల కన్వీనర్ అడ్డాల శ్రీను గారు, గౌరవ అధ్యక్షులు బదిరెడ్డి దొర గారు, జనవాణి ఇంచార్జ్ ముక్కా రాంబాబు గారు, కర్రి దొరబాబు గారు, యర్రంశెట్టి పోలరావు గారు, దేవన దుర్గారావు గారు, తన్నీరు తాతాజీ గారు, చదువు ముక్తేశ్వరరావు గారు, వాకపల్లి రాజు గారు, పి. డి. వి. ప్రసాద్ గారు, మట్ట నాగేశ్వరరావు గారు, ప్రగడ దుర్గారావు గారు, చిక్కిరెడ్డి దొర గారు, నారిపిరెడ్డి మంగతాయారు గారు, కర్రి గణేష్ గారు, ఇతర NDA నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,853 Views

You may also like

Leave a Comment