


దేవీపట్నం ప్రెస్ నోట్:VRM Midea దుర్గా ప్రసాద్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం రాష్ట్రకూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఇందుకూరుపేట గ్రామం స్థానిక ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల నందు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంపచోడవరం సీఐ రవి కుమార్ దేవీపట్నం ఎస్.ఐ కే షరీఫ్ తహసీల్దార్ సత్యనారాయణ యం.ఈ.వో బాలు దొర టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు సమావేశానికి హాజరైన విద్యార్థుల తల్లి,దండ్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జనసేన మండల అధ్యక్షులు రాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు,పాఠశాల ఉపాధ్యాయులు ఓకే కుటుంబ సభ్యులులా కలసి చర్చించుకునేందుకు ఒక చక్కటి అవకాశం మెగా పేరెంట్స్ మీటింగ్ ద్వారా కల్పించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలలో జరుగుతుందని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు.పాఠశాలలో గురువులు పిల్లలకు మంచి చదువు అందించడం, క్రమశిక్షణ నేర్పడం జరుగుతుందని, పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల చేత చదివించడం, వారికి పెద్దలను,గురువులను ఎలా గౌరవించాలి అనేది నేర్పడం తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైన స్థానానికి చేరుకున్న వారు ఎందరో ఉన్నారని వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. జూనియర్ కళాశాల భవన నిర్మాణం త్వరలోనే మొదలవుతుందని యుద్ధ ప్రాధిపదికన ఆరునెలల్లో పూర్తి అవుతుందని తెలియచేసారు కళాశాల భవనం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసారు…ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకామిటి ఛైర్మెన్ మండల టీడీపీ అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు జిల్లా మరియు మండల నాయకులు పాల్గొనగ జనసేన సీనియర్ నాయకులు కోండ్ల సురేష్ రెడ్డి,తోకల గంగరాజు,ఐనవిల్లి భద్రం, తురసం ఆదివాసి నాయకులు తెల్లం శేఖర్, కారం రామన్న
, నాగేశ్వరరావు సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird