Home వార్తలుఖమ్మం నగర దీపికలను సన్మానించిన ఏఐటియుసి.

నగర దీపికలను సన్మానించిన ఏఐటియుసి.

by VRM Media
0 comments

నూతనంగా కల్లూరు పురపాలక సంఘం ఏర్పాటుతో మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన ఐకెపి వివోఏలు మున్సిపాలిటీ లోకి రావడంతో వారిని ఐకెపి వివో ఏలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి గత 22 సంవత్సరాలుగా ఐకెపి వివో ఏలు కలిసి మెలిసి ఉండటం తో వారు మండలంలో ఐకెపి చేసిన సేవలను గుర్తుకు చేసుకుంటూ సన్మానించారు .నగర దీపికలు కుమారి ,రమాదేవి, ఫాతిమా, శివ నాగలక్ష్మి, పుల్లమ్మ, సునీత, పుష్ప, తదితరులతోపాటు ఐకెపి వివోఏలు వేము నాగమణి ఏఐటీయూసీ నాయకులు వేమురాంబాబు దామాల దయాకర్ రావు వారిని సన్మానించారు. సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘాలలో ఆర్థికంగా రుణాల అందిస్తూ మహిళలను బలోపేతం చేయడానికి కృషి చేశారని విద్య వైద్య ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రతవిషయాలతో మహిళలను చైతన్యవంతం చేశారని పేర్కొన్నారు. నగర దీపికలుగా వెళ్లిన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి వారికి ఆర్థికపరమైన సలహాలు సూచనలు అందించాలని కోరారు. VRM న్యూస్ ప్రతినిధి రాథోడ్ శ్రీనివాస్ కల్లూరు.

2,842 Views

You may also like

Leave a Comment