Home వార్తలుఖమ్మం కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కల్లూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు

కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కల్లూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు

by VRM Media
0 comments

అనుచిత వ్యాఖ్యలు చేస్తే జిల్లాలోకి రానివ్వం ఏఎంసీ చైర్మన్

కల్లూరు అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారి నందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై జిల్లాలో వున్న ముగ్గురు మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆయన దిష్టిబొమ్మ ను దగ్ధం చేసి స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ భాగము నీరజాదేవి మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నతమైన పదవులు చేపట్టి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. వారి తండ్రిలాగా ఫామ్ హౌస్ లో పండుకొని పరిపాలన చేయలేదని విమర్శించారు. మా మంత్రులు రాష్ట్ర ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి బిఆర్ఎస్ మనుగడ కోల్పోతుందనే దురుద్దేశంతో మా మంత్రులపై అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమం కల్లూరు మండల సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ ఏనుగు సత్యంబాబు యువ నాయకులు ఆలకుంట నరసింహారావు, ఆలయ కమిటీ చైర్మన్ దారా రంగా తక్కిళ్ళపాటి దుర్గాప్రసాద్, పెద్ద బోయిన శ్రీనివాసరావు, కృష్ణశెట్టి కొండలు, పెద్ద పోయిన నరసింహారావు, మట్ట రామకృష్ణ, పొన్నూరు వెంకటేశ్వరరావు, కంభంపాటి పుల్లారావు, తాండూ రాములు, జిల్లెల్ల కృష్ణారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

2,859 Views

You may also like

Leave a Comment