Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సారధ్యంలో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం.. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియల శిరీష విజయభాస్కర్

చంద్రబాబు సారధ్యంలో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం.. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియల శిరీష విజయభాస్కర్

by VRM Media
0 comments

రంపచోడవరం ప్రెస్ నోట్: జూలై 26 VRM Midea దుర్గా ప్రసాద్:

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలోనే కాదు అక్కడ నాయకులను ప్రోత్సహించడంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్నా విషయం మరోసారి స్పష్టమైందనీ రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీష విజయభాస్కర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ వెనకబడిన ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతిరాజునీ గోవా గవర్నర్ గా పదవి రావడం. కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర విమానయన మంత్రులు చేయడం సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాధారణ కార్యకర్త కలిసే అప్పలనాయుడు ఎంపీగా చేయడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు.అంతేకాకుండా అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణం లాంటిదని. ఉత్తరాంధ్రలో విద్యాసంస్థల స్థాపనకు ఆలయాలకు వేల ఎకరాలు ధర దత్తం చేసిన అశోక్ గజపతిరాజుని గత వైసిపి ప్రభుత్వం మానసికక్షోభ కు గురిచేసింది అన్నారు. నీతి నిజాయితీలకు నిలువుటద్దంలో ఉన్న అశోక్ గజపతిరాజుని అక్రమ కేసులు పెట్టి వేధించడంతోపాటు వెధవ, యూజ్లెస్ ఫెలో, అంటూ అవమానించారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను దోచుకోవడమే తప్ప ఇక్కడి నాయకులకు గౌరవం ఇవ్వలేదని ఇక్కడ ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. గత టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను కూడా ఉత్తరాంధ్ర నుంచి జగన్ రెడ్డి అండ్ ముఠా తరిమెసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు టిసిఎస్, కాగ్నిజంట్, గూగుల్ డేటా సెంటర్లు విశాఖకు తరలివచ్చాయన్నారు. విశాఖలో ఐటీసేజ్, ఎన్ టి పి సి గ్రీన్, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ ఇలా ఉత్తరాంధ్రకు ఒక్క ఏడాదిలోనే సాధించారనీ. ఉత్తరాంధ్ర పరిశ్రమల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నిధులు కేటాయించారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉత్తరాంధ్ర ప్రజలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చూపిస్తున్న ఆదరణ అభిమానానికి నిదర్శనం అని ఈ సందర్భంగా కొనియాడారు.

2,857 Views

You may also like

Leave a Comment