
దేవీపట్నం ప్రెస్ నోట్:VRM Midea దుర్గా ప్రసాద్
రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలకు శాపంగా మారింది.ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన నిర్వాసితులకు రావలసిన నష్టపరిహారాలు అన్ని సగం సగంగానే ఇవ్వటం జరిగింది.గత ప్రభుత్వం నిర్వాసితులకు ఏది పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి అని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం పి గొందూరు గ్రామ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో పూర్వకాలం నుండి నివాసం ఉంటున్న కొంతమందికి ఆర్ & ఆర్ ప్యాకేజీ ఇవ్వని పరిస్థితి, అదేవిధంగా పద్దేనిమిది సంవత్సరాలు నిండిన యువతీయువకులకు రావలసిన ప్యాకేజీ ఐదులక్షల ఎనబైవేలకు తమ ఖాతాలయందు 2014 వ సంవత్సరంలో రెండు లక్షల ఐదువేలు మాత్రమే జమచేయడం జరిగిందని, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికి మిగిలిన సొమ్ము ఇంకనూ జమచెయలేదని,ప్రాజెక్టు ముంపుకు గురికాని డి-నమూనా పట్టా కలిగిన డబ్బై ఎకరాల భూమికి నష్టపరిహారం ఇవ్వలేదని, అదేవిధంగా గిరిజనులం అని గొంతెత్తి ఎవరిని ఏమి అనలేమని మా ఆర్ ఓ ఎఫ్ ఆర్ (కొండపోడు భూమి) పట్టాలకు కూడా ఏ విధమైన నష్టపరిహారం ఇవ్వకుండానే మా భూమి యందు పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ పనులు మొదలుపెట్టి పనిచేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సమస్యలపై రంపచోడవరం ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి మరియు సబ్ కలెక్టర్ వారి కార్యాలయానికి చాలాసార్లు అర్జీలు పెట్టిన ఏ విధమైన స్పందనైతే లేదని ఆ గ్రామ ప్రజలు తెలిపారు.అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మేము మా జీవితాలనే త్యాగం చేసామని, అటువంటి మమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాయందు దయతలచి ఇప్పటికైనా మా సమస్యలపై స్పందించాలని పి గొందూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird