Home వార్తలుఖమ్మం జూపూడి బ్రదర్స్ ని పరామర్శించిన…మండల కాంగ్రెస్ నాయకులు

జూపూడి బ్రదర్స్ ని పరామర్శించిన…మండల కాంగ్రెస్ నాయకులు

by VRM Media
0 comments

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్:

మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన కల్లూరు మండల ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షులు జూపూడి జయరాజ్ తండ్రి ఇటీవల మరణించగా, ఆదివారం జరిగిన జ్ఞాపకార్థ కూటమికి హాజరై జూపూడి సామేలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు. అనంతరం వారి కుమారులు జూపూడి బాబు, జయరాజు లను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాగం ప్రభాకర్ చౌదరి, తక్కెళ్ళపాటి దుర్గాప్రసాద్, మట్టా రామకృష్ణ, మూకర విజయరావు, దామాల సురేష్ బాబు, మేకల సురేష్, జినుగు విజయదాసు,
ఖమ్మం జిల్లా స్టాపర్ వేము మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

2,896 Views

You may also like

Leave a Comment