

మన్యంలో రెడ్ క్రాస్ సోసైటి సేవలు భేష్
హుకుంపేట (అల్లూరి జిల్లా) న్యూస్: VRM Media
అల్లూరి జిల్లా హుకుంపేట స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఇంగ్లీష్ బాలికల పాఠశాలలో నేడు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ గంగరాజు మరియు మెంబర్ మీడియాతో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అన్ని జిల్లాలకన్నా మన అల్లూరి జిల్లాలో అనేక మంది ప్రజలు రక్తహీనతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాల దారిన పడిన వారు,గర్భిణీలు ప్రసవం నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అనివార్య కారణాల వలన ఆపరేషన్ చేయాలన్నా రక్తం తప్పనిసరి అవుతుందని అయితే రక్తం అధిక మోతాదులో నిల్వ లేక బాధితులుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెడ్ క్రాస్ ద్వారా రక్తం సేకరించినప్పటికీ ఇప్పుడు మా దగ్గర అందుబాటులో ఉన్న దానికన్నా అధిక శాతం రక్తం అవసరం అవుతుందని కొన్ని సమయాల్లో బాధితులకు అవసరమయ్యే గ్రూప్ రక్తం దొరకక మరణాలు కూడా సంభవిస్తున్నాయని నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అని కన్నీటి పర్యం అయ్యారు. దయచేసి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నేడు సకాలంలో రక్తం అందుబాటులో లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు,ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు సమయానికి రక్తం అందుబాటులో లేక మరణాల పాలవుతున్నారనే విషయం గుర్తించి మనమందరం రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆలోచించి సేవా భావంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎం సి ప్రసాద్ నాయుడు, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఇంగ్లీష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనా కుమారి వారి సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ గౌరీ శంకర్, ట్రెజరరీ సూర్యం మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird