అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం శరభవరం పంచాయతీ రామన్నపాలెం గ్రామంలో కుక్క సీతమ్మ తాటకు ఇల్లు 9:30 ఆ ప్రాంతంలో గ్యాస్ లీక్ అవడంతో ఇల్లు కాలిపోయింది. ప్రమాద శాతం ఎవరికి ఏమీ అవ్వలేదు అలాగే పక్కన ఉన్న కుక్క వెంకట్రావు ఇల్లుకు కాలేటప్పటికీ గ్రామస్తులు, ఆర్పడానికి ప్రయత్నిస్తు ఉండగా కోరుకొండ నుండి ఫైర్ ఇంజన్ రావడంతో మంటలను అదుపులోకి తీసుకున్నారు. కుక్క సీతమ్మ వృద్ధురాలు ఆమెకి ఎవరూ లేరు ఒకటే ఉండేది చూసే వాళ్ళు కూడా లేరు. నెలకు వచ్చిన పింఛన్ డబ్బులతోనే బతికేది. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదు.