Home ఆంధ్రప్రదేశ్ సియం సహాయ నిధి చెక్కును అందించిన కుప్పాల వెంకటసుబ్బయ్య

సియం సహాయ నిధి చెక్కును అందించిన కుప్పాల వెంకటసుబ్బయ్య

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ ఆగస్ట్ 6

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి, యువ నాయకులు నారా లోకేష్ మరియు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ గార్ల ఆదేశాల మేరకు సిద్దవటం మండలం బొగ్గిడివారిపల్లె గ్రామ పంచాయతీ ఆకురోపల్లె హరిజన వాడలో వుండే గంపాల శోభా, చంద్ర లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుప్పాల వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఇటీవల గంపాల కొండయ్య అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చేరారు కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. ఆయన వైద్యం కోసం అయిన ఖర్చులు, బిల్లులు సీ.యం సహాయ నిధికి పంపించగా వారికి బుధవారం 100,568 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుధా నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

2,848 Views

You may also like

Leave a Comment