
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 9
బాకరాపేట పోలీస్ బెటాలియన్ లో కమాండెంట్ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు జరిగినవి ఈ కార్యక్రమమునకు నేషనల్ హై వే అథారిటీ సంబంధించిన అమ్రిత్ గౌతమ్ మ రియు శ్రీమతి త్రిప్తా గౌతమ్ హాజరయ్యారు. ఈ వేడుకలో శ్రీమతి. త్రిప్తా గౌతమ్ కమాండెంట్ కి ,అసిస్టెంట్ కమాండెంట్ మరియు యూనిట్ పోలీసు సిబ్బందికీ రాఖీలు కట్టడమైనది బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ రాఖీ పండుగను ప్రతి సంవత్సరము అందరు ఘనంగా జరుపుకుంటామని అన్నా చెల్లెళ్ళ అనుబందాన్ని తెలిపే రాఖీ పండుగ చాలా గొప్పదని అన్నారు . ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పి యన్ డి ప్రసాద్ , డి య పి శ్రీ కె వెంకట రెడ్డి మరియు ఆర్ ఐ లు , ఆర్ యస్ ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు