

సిద్ధవటం VRM రిపోర్టర్ ఆగస్టు9
మండలంలోని బొగ్గిడి వారి పల్లె గ్రామ సచివాలయంలో తిరుపతి పట్టణం లోని రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో టిడిపి నేత రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో పేషెంట్లు దాదాపు 75 మంది కి చికిత్స సేవలు అందించామని మా వైద్యశాలలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స సేవలు అందిస్తామని బొగ్గిడి వారి పల్లె, నే క నా పురం, చాముండేశ్వరి పేట గ్రామాలకు చెందిన వివిధ ఆరోగ్య సమస్యతో బాధపడే 10 మంది పేషెంట్లను ఉచిత ట్రావెల్స్ సౌకర్యం ఏర్పాటు చేసి చికిత్స సేవలకు తరలిస్తున్నామని అన్నారు వైద్య శిబిరం ఏర్పాటుకు అన్ని విధాల సహకరించిన టిడిపి నేత కుప్పాల వెంకటసుబ్బయ్యకు వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు