Home kadapa ఒంటిమిట్టలో కూటమి దూకుడు – నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో ఉత్సాహభరిత ప్రచారం

ఒంటిమిట్టలో కూటమి దూకుడు – నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో ఉత్సాహభరిత ప్రచారం

by VRM Media
0 comments

ఒంటిమిట్టVRM న్యూస్ ఆగస్టు 9

ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఉపఎన్నికల వాతావరణం వేడెక్కింది. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో, మైనారిటీ మంత్రివర్యులు శ్రీ ఫారూఖ్ గారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి నేతృత్వంలో విస్తృత స్థాయిలో ప్రచార యాత్ర కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మంత్రివర్యులు శ్రీ ఫారూఖ్ గారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. “పెన్షన్ అందుతున్నదా?”, “తల్లికి వందనం పథకం లబ్ధి పొందారా?” వంటి ప్రశ్నలతో ప్రజాభిప్రాయాలను సేకరిస్తూ, గ్యాస్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ వంటి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ప్రచార కార్యక్రమంలో కల్లుగీత డైరెక్టర్ వెంకటనరసయ్య గారు, మామిళ్ళ ఈశ్వరయ్య, పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, సుబ్బారాయుడు, శంకర, రాజశేఖర్ యాదవ్, మణి, సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం తదితర టీడీపీ నాయకులు చురుకుగా పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి విజయం కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై కృషి చేస్తున్నారు.

2,874 Views

You may also like

Leave a Comment