Home ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలి.

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలి.

by VRM Media
0 comments

ఆదివాసీ స్వయం పాలన రాష్ట్రం ప్రకటించాలి. ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్.

దేవీపట్నం ప్రెస్ నోట్: VRM Media

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమకాల చట్టం ప్రకటించాలి,ఆదివాసీ స్వయం పాలన రాష్ట్రం ప్రకటించాలని, కారం తమ్మన్న దొర పేరుతో రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని,షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు హామీ అమలు చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ శేఖర్ డిమాండ్ చేశారు… సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈరోజు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ముందుగా ఆదివాసీ పోరాటయోధుల చిత్ర పటాలకి పువ్వుల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.తరువాత సర్పంచ్ కారం కృష్ణ బాబు దొర,తుర్రం లక్ష్మణ్ దొర చేతుల మీదుగా ఆదివాసీ జెండా ఆవిష్కరించారు.తరువాత ఆదివాసీలందరూ కలసి ఇందుకూరు పేట గ్రామం నుండి ఆర్ అండ్ ఆర్ కాలనీ పెద్ద భీం పల్లి 2 పెనికిల పాడు గ్రామం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి అక్కడ మానహారంగా నిలబడి నినాదాలు ఇవ్వడం జరిగింది. అక్కడనుండి మళ్లీ బైక్ ర్యాలీగా ఇందుకూరుపేట దుర్గమ్మ తల్లి గుడి మెయిన్ సెంటర్ వరకు చేరుకొని ఆదివాసి భవనం స్థలం నుండి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సెంటర్లో సంస్థలపై నినాదాలు ఇవ్వడం జరిగింది.అక్కడనుండి ర్యాలీగా స్త్రీ శక్తి భవనంలో ఏర్పాటుచేసిన ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు సభా స్థలానికి సభ అధ్యక్షులు కుంజం శ్రీను వాసు దొర అధ్యక్షతన మొదలైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవీపట్నం మండల మెజిస్ట్రేట్,తహసిల్దార్ కె.సత్యనారాయణ,ఎంపీడీవో సాల్మన్ రాజు,ఎంఈఓ కె.త్రిమూర్తులు,ఎంపీడీవో కార్యాలయం ఏవో వెంకటేశ్వర్లు, అతిథులు సర్పంచ్ కారం కృష్ణ బాబు దొర,తుర్రం లక్ష్మణ్ దొర,చిచ్చడి శేషారావు,మడకం కన్నం రాజు,తుర్రం రామకృష్ణ దొర,సోదే నాగేశ్వరరావు,కారం పోచమ్మ,కందికొండ గౌరీశ్వరి,కురసం వెంకన్న దొర,మడకం బంగారు బాబు దొర,దూడ దైవబిక్షం,మడకం రామకృష్ణ దొర,కారం రామన్న దొర,యలగాడ నాగేశ్వరరావు,పెసా ఉపాధ్యక్షులు జీడి రామారావు మొదలైన వక్తులు సభకు వచ్చిన ఆదివాసి ప్రజలకు ఆదివాసి సంస్కృతి,సాంప్రదాయాలు హక్కులు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం అన్ని గ్రామాల నుండి వచ్చిన గ్రామ పెద్దలకు శాలువలుతో ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది.అనంతరం దేవీపట్నం మండల మెజిస్ట్రేట్,తహసిల్దార్ కె.సత్యనారాయణ కి సమస్యలతో కూడిన పత్రాలు అందజేశామన్నారు.

ఈ కార్యక్రమంలో అరగంటి వీరభద్ర రెడ్డి,కెచ్చల అబ్బాయి రెడ్డి,మడి మురళి,చవలం విద్యాసాగర్,తెల్లం సింగరాజు దొర,కొమరం సూర్య చంద్రం దొర,కొమరం సూరిబాబు దొర,కుంజం పండు దొర,కుండ్ల సాయిరాం రెడ్డి,నడిపూడి భాను శంకర్ రెడ్డి,పెసా ఉపాధ్యక్షులు కుండ్ల సురేష్ రెడ్డి,సోదే వెంకన్న దొర మాజీ సర్పంచ్,పచ్చుకూరి అర్జునుడు,పొడియం సురేష్ దొర,దూసరి కనకదుర్గ మొదలైన వారు పాల్గొన్నారు

2,845 Views

You may also like

Leave a Comment