

VRM Media
ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు ఆదివాసి జీవన శైలి ఆదివాసి బిడ్డ సీతానగరం మండల ఎరుకల కమ్యూనిటీ ప్రెసిడెంట్ మానుపాటి అంజిబాబు కు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా సబ్ కలెక్టర్ గారు చేతుల మీదగా గౌర ప్రతిష్టగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి బిడ్డగా నన్ను గుర్తించి సన్మానం చేసినందుకు నాకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే సభ కలెక్టరు గారికి, డిఎస్పి గారికి, అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 09 ఆదివాసుల దినోత్సవం రావడం మా ఎంతో సంతోషంగా ఉందన్నారు. గిరిజన అడవి బిడ్డగా మాకు ఎంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆదివాసి బిడ్డలు, అధికారులతో ఆదివాసుల దినోత్సవం ఘనంగా జరిగింది.