

అన్నమయ్య జిల్లా VRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 10
రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషా
రాయచోటి /అన్నమయ్య జిల్లా పవిత్ర స్థలం మక్కాకు వెళ్తున్నారు కాబట్టి వారు సంతోషంగా ఉండా లన్నదే సిఎం చంద్రబాబు నాయు డు ధ్యేయమని హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష పేర్కొన్నారు. ఆదివారం రాయ చోటిలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయం నందు మంత్రి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాషాతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధి సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని, ముస్లింల అభివృ ద్ధి సంక్షేమం కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే జరిగిందని తెలిపారు