
ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు, ఖమ్మం కార్పొరేటర్ బి. జి. క్లెమెంట్.
నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపల్ కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుందని ఆ సంఘ జాతీయ సమితి సభ్యులు ఖమ్మం నగర కార్పొరేటర్ బి. జి. క్లెమెంట్ భరోసా ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నూతనంగా ఏర్పాటుచేసిన ఏఐటియుసి జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఓడల కృష్ణమూర్తి, షేక్ వజీర్ మియ్యా ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐటియుసి రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సమ్మె చేసిన 1500 మంది మున్సిపల్ కార్మికులను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించినప్పుడు ఏఐటియుసి అగ్ర భాగాన ఉండి పోరాటం చేసి మరల వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా కృషి చేసిందన్నారు. గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు చాలామంది గ్రామపంచాయతీ కార్మికులను చాలా మున్సిపాలిటీలలో తిరిగి తీసుకోలేదని అలాంటి వారి అందరినీ కలుపుకొని హైదరాబాదు మున్సిపల్ కార్యాలయం మీద ధర్నా చేసి గ్రామపంచాయతీలో పని చేసిన పంచాయితీ కార్మికులు అందరినీ మున్సిపాలిటీ ఉద్యోగులుగా గుర్తించటానికి పోరాటం చేసి సఫలీకృతమైందన్నారు. ఈరోజు గ్రామపంచాయతీలో పనిచేసిన పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులుగా గుర్తింపు పొందారంటే అది కేవలం ఏఐటియుసి చేసిన పోరాట ఫలితమే అన్నారు. పారిశుద్ధ్య పనిచేసే కార్మికులకు ప్రభుత్వమే సేఫ్టీ గార్డ్స్ ను అందించాలన్నారు. అంతేకాకుండా వారికి పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మరియు 10 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ ను ప్రభుత్వమే చేర్పించాలన్నారు. ఏఐటీయూసీ నాయకత్వాన్ని 103 సిబ్బందికి గాను 100 మంది యూనియన్ లో చేరటం శుభ పరిణామం అన్నారు .నాలుగు లేబర్ కోడ్ అమలును రద్దు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.ఉద్యోగ భద్రత కల్పించాలి. 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని బోనస్, ఇఎస్ఐ చట్టాలలో వేతన సీలింగ్ పరిమితిని పెంచాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర 2వ పిఆర్సిలో కనీస వేతనం రూ.26,000/- లుగా నిర్ణయించాలనీ ఆయన
మున్సిపల్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి, నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా, డ్రైవర్లుగా, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్స్ కల్పించాలని.కార్మికులు మరణిస్తే దహన (మట్టి) ఖర్చులు నిమిత్తం రూ.30,000/-లు ఇవ్వాలని,వయస్సు పైబడిన, అనారోగ్యానికి గురైన, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలనీ స్వచ్ఛ ఆటో, ఆర్టికల్చర్, హరితహారంలో పనిచేస్తున్న కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలిన్నారు.కొత్తగా నియమించుకున్న కార్మికులకు పాత కార్మికులతో సమానంగా రూ.16,600/-ల వేతనం చెల్లించాలన్నారు. ఆదివారాలు, పండుగల సందర్భంగా అందరికీ వర్తించేలా సెలవులు ఇవ్వాలని ,మున్సిపల్ కార్మికులందరికీ డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ళ స్థలాలు కేటాయించాన్నారు. పెరుగుతున్న పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాదె లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు , జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ , వేము రాంబాబు, దామల దయాకర్, తెలంగాణ మున్సిపల్ స్టాప్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఓడల కృష్ణమూర్తి, షేక్ వజీర్ మియా, చింతపల్లి శ్రీను,పి. ప్రకాష్, మోదుగు సీతమ్మ, గొల్లమందల యశోద తదితరులు పాల్గొన్నారు.