
ఉప ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ
హుకుంపేట (అల్లూరి జిల్లా ) న్యూస్ :VRM Media
అల్లూరి జిల్లా హుకుంపేట మండల వైస్ ఎంపీపీగా విధులు నిర్వహించే ఒంటూబు ప్రియాంక ఉద్యోగ రీత్యా పదవికి రాజీనామా చేయడంతో నేడు ఆ పదవి భర్తీ చేసేందుకు జరిగిన ఎన్నికల్లో భాగంగా రంగశీల సెగ్మెంట్ ఎంపిటిసి గంజాయి. సుశీల గెలుపొందారు. అయితే నేడు ఈ వైస్ ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు వివిధ కోణాల్లో రాజకీయం జరిగినప్పటికీ ఈ పదవి వైసీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా నూతన వైస్ ఎంపీపీ గంజాయి.సుశీల మీడియాతో మాట్లాడుతూ ముందుగా నా ప్రజలకు, వైసీపీ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని ఎందుకంటే ఆనాడు నేను ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఈమె అయితే మనకు సేవ చేస్తుంది మన ప్రాంతా అభివృద్ధి చేస్తుందని ప్రజలు నన్ను నమ్మి నాకు ఆనాడు పదవి కల్పించారు.నేడు ఈ పదవి కూడా వారి ఆశీస్సులు వలనే దక్కిందని భావిస్తున్ననని అన్నారు. అలాగే నాకు ఎల్లవేళలా అండగా వుంటూ నన్ను ఎన్నుకున్న వైసీపీ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నన్ను నమ్మి ఈ పదవి కల్పించినందుకు గాను ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరింతగా ప్రజలకు చేరువై ప్రజలతో మమేకమై వారు సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారం చేయడం ఖాయమని ఆమె హామీ ఇచ్చారు. ఏది ఏమైనాప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నేడు ఈ వైస్ ఎంపీపీ పదవి వైసీపీ క్యాడర్ కైవసం చేసుకోవడంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు వైసీపీ దేనని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు.