
ఉప్ప వారపు సంతలో భారీ ర్యాలీ
(హుకుంపేట అల్లూరి జిల్లా న్యూస్):VRM Media
అల్లూరి జిల్లా హుకుంపేట మండల పరిధిలోగల మత్స్యపురం పంచాయితీ పరిధిలో గల ఉప్ప ప్రధాన కేంద్రంగా నూతన మండలంగా ఏర్పాటు చేయాలని నేడు ఉప్ప వారపు సంతలో 21 పంచాయతీలకు చెందిన గిరిజనులు, ప్రజా ప్రతినిధులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉప్ప మండల సాధన కమిటీ సభ్యులు పాంగి. సింహాచలం మరియు ప్రజా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వం నూతన మండలాలకు శ్రీకారం చుట్టడం మేము స్వాగతిస్తున్నామని, ఈ తరుణంలోనే 16 పంచాయతీలకు సంబంధించిన గిరిజనులు అనారోగ్యం బారిన పడి ఆసుపత్రికి వెళ్లాలన్న ప్రధాన కార్యాలయాలకు పనులు నిమిత్తం వెళ్ళాలన్నా ఏ అత్యవసర పనికైనా సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని దీనివలన అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ముఖ్యంగా గతంలో అనారోగ్యం బారిన పడినవారు సకాలంలో వైద్యం నిమిత్తం ఆసుపత్రికి సమయానికి చేరుకోలేక అనేక మంది గిరిజనులు చనిపోయారని ఈ పంచాయతీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మా గ్రామాలు అభివృద్ధి చేయండి అని అధికారులకు ఫిర్యాదు చేసిన మారుమూల ప్రాంతాలనే చులకన భావంతో కనీసం ఫిర్యాదు చేసిన సమస్యపై కూడా మండల అధికారులు సమస్యలు పరిష్కారం చేయడం దేవుడెరుగు కనీసం మా గ్రామాలను గ్రామాలను సందర్శించకపోవడం దౌర్భాగ్యం అని, నేటి వరకు 21 పంచాయతీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారంకై అనేకమార్లు జిల్లా అధికారులను నేరుగా కలిసి వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోవట్లేదని కనుక నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల విభజన కార్యక్రమంలో భాగంగా ఉప్ప ప్రధాన కేంద్రంగా తీసుకొని మండలంగా ప్రకటిస్తే 21 పంచాయతీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయాని ప్రజా ప్రతినిధులు కూడా అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించి గిరిజనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఏదేమైనాప్పటికీ 16 పంచాయతీలకు సంబంధించిన గిరిజనులు పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేరుగా కనిపిస్తున్నాయి కనుక దయచేసి నేటి కూటమి ప్రభుత్వం మరియు జిల్లా అధికార యంత్రాంగం గిరిజనులు పడుతున్న సమస్యలపై దృష్టి సారించి ఉప్ప ప్రధాన కేంద్రంగా తీసుకొని మండలం గా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 21 పంచాయతీలకు సంబంధించిన గిరిజనులు ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.