

పులివెందుల VRM న్యూస్ ఆగస్టు 14
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల విజయం కు జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాసుల రెడ్డి గారికి, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల విజయం కు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారికి, ఇంచార్జి మంత్రి శ్రీ సబితమ్మ గారికి, రవాణా మంత్రివర్యులు శ్రీ రామ ప్రసాద్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ ధన్యవాదములు తెలిపిన టీడీపీ కార్యదర్శి నాగ ముని రెడ్డి గారు మరియు పార్టీ శ్రేణులు
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లత రెడ్డి గారు 6735 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మాట్లాడుతూ – “మొట్టమొదటి సారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 30 ఏళ్ళుగా కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ప్రజలే బుద్ధి చెప్పి నిజాయితీ, అభివృద్ధి మార్గంలో నడిచే అభ్యర్థినే గెలిపించారు” అన్నారు.
అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ముద్దు కృష్ణ రెడ్డి గారు 6312 ఓట్లతో విజయాన్ని సాధించి టీడీపీ బావుటా ఎగురవేశారు. ఈ రెండు విజయాలు ప్రాంతంలో టీడీపీ శక్తిని మరోసారి రుజువు చేశాయని, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని నాగ ముని రెడ్డి గారు తెలిపారు
అతను ఇంకా మాట్లాడుతూ, "ఈ విజయం కేవలం టీడీపీకి గెలుపు మాత్రమే కాదు, ప్రజల ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు నిదర్శనం. భవిష్యత్తులో పులివెందుల అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాము. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు పులివెందుల రాజకీయ చరిత్రలో మలుపు తిప్పే ఘట్టంగా నిలుస్తుంది" అని నాగ ముని రెడ్డి గారు పేర్కొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird