Home ఆంధ్రప్రదేశ్ కడపయపల్లి గ్రామంలో రైతుల భూముల రీసర్వే పై సమావేశం

కడపయపల్లి గ్రామంలో రైతుల భూముల రీసర్వే పై సమావేశం

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 19

సిద్దవటం మండలంలోని కడపయపల్లి గ్రామం పరిధిలో రైతుల భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా టక్కోలు గ్రామ సచివాలయం వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆకుల తిరుమల బాబు, ఆర్‌ఐ నరసింహ ప్రసాద్, డిప్యూటీ సర్వేయర్ సోమశేఖర్, వీఆర్‌ఓ రజని, విలేజ్ సర్వేయర్ కారుణ్య గార్లు పాల్గొని రైతులకు రీసర్వే విధానం, భూముల సరిహద్దులు, రికార్డుల సరిదిద్దుపై పూర్తి వివరాలు అందించారు.
ఈ సందర్భంగా గ్రామ నౌకర్లు కూడా సహకరించగా, రైతుల నుండి సూచనలు, ప్రశ్నలు స్వీకరించారు.
సమావేశంలో మాజీ ఎంపీటీసీ, పార్లమెంట్ కార్యదర్శి నాగ ముని రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ప్రత్యేకంగా హాజరై రీసర్వే పనులకు తమ మద్దతు తెలిపారు.

2,879 Views

You may also like

Leave a Comment