
స్టాఫ్ రిపోర్టర్ రెడ్డి శేఖరబాబు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం
పింఛా ప్రాజెక్టు జలాశయం నుండి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. పింఛా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పొంగిపొర్లుతున్న దృష్ట్యా జలహారతితో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నీటిని విడుదల చేశారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పింఛా ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరుతో పింఛా ప్రాజెక్ట్ నిండిన నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పింఛా ప్రాజెక్టు కెపాసిటీ 327.60 MCFT కు చేరుకుందన్నారు. ప్రాజెక్టు నుండి కిందకు నీటిని విడుదల చేయడంతో కుడి కాలువ ఆయకట్టు ద్వారా 2,211 ఎకరాలకు, ఎడమ కాలువ ఆయకట్టు ద్వారా 1,562 ఎకరాలకు మొత్తం 3,773 ఎకరాలకు సాగు మరియు త్రాగునీటి అవసరాలకు నీతిని అందించడం జరుగుతోందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సాగు మరియు తాగునీటి కి ఎటువంటి నీటి సమస్య ఉండదన్నారు. వర్షాల కారణంగా వరద ముప్పును తగ్గించడానికి ఫ్లడ్ గేట్లను అర అడుగు మేర ఎత్తడం జరిగిందని కుడి, ఎడమ కాలువకు సంబంధించిన చెరువులకి నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఎడమ కాలువకు సంబంధించిన చెరువులకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా, ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు మరియు పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నీటి విడుదల జరుగుతున్న నేపధ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ వెంకటరామయ్య, డిఈ చెంగల్ రాయులు, తాసిల్దార్, నీటిపారుదల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird