

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 25
కడప జిల్లాఎస్ కే ఆర్ అండ్ ఎస్ కే ఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేమల సలీం భాష కవిత్వీకరించిన ' సమీచీనం' పుస్తక పరిచయ కార్యక్రమాన్ని తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా వైయ స్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కడప ఎస్ కే ఆర్ అండ్ ఎస్ కే ఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లి కార్జున రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ప్రభుత్వ పురుషు లకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవీంద్రనాథ్ , పుస్తక పరిచయం చేసేటందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డాక్టర్ తవ్వా వెంకటయ్య,విశిష్ట అతిథిగా 'కవయిత్రి' జి యల్ లావణ్య , ఆత్మీయ అతిథిగా వల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ జి వి సాయిప్రసాద్, గౌరవ అతిథిగా ప్రముఖ కవి వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం గౌరవ సలహాదారులు ఎస్ఏ సత్తార్ ఫైజి, ప్రత్యేక అతిథిగా అనంతపూర్ ప్రభుత్వ పురుషుల కళాశాల జువాలజీ అధ్యాపకులు జి ఎల్ ఎన్ ప్రసాద్ విచ్చేయనున్నారని, ఎస్ కే ఆర్ ఎస్ కే ఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఎం వి నాగ సుధారాణి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని అన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తారని తెలియజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird