

Vrm media ప్రతినిధి Sambasivarao warangal
హనుమకొండ : వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాల వినియోగం వల్ల జల వనరులు, కాలుష్యానికి గురవుతాయాని, అందుచేత కృత్రిమ రంగులు, రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం పట్ల ప్రజల్ని చైతన్యపరిచే విధంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజిద్దాం అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల పంపిణి కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అధికారులు ప్రారంబించారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird