

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు27
వినాయక చవితి పండుగ సందర్భంగా సిద్ధవటం మండలంలోని మాధవరం1 గ్రామంలోని, రామకృష్ణాపురం, మాధవరం, ఎస్ కే ఆర్ నగర్ ఎస్సీ కాలనీ గ్రామాల్లో ఏర్పాటుచేసిన వినాయక ఉత్సవాల మండపాల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిమిత్తం రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో టిడిపి పార్లమెంట్ వాణిజ్య విభాగ కార్యదర్శి ఎన్నారై చంద్ర ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ సిద్ధవటం మండలంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిమిత్తం ఆర్థికంగా సహాయ కార్యక్రమాలు అందించామని మరియు కొన్ని గణేష్ ఉత్సవాల మంటపాల్లో అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలిపారు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ వాణిజ్య విభాగపు కార్యదర్శి ఎన్నారై చంద్ర, కూటమి యువనేత శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు