

ఉత్సవాలకు, డేరంగుల కుటుంబీకులు కాణిపాకం లడ్డు సమర్పణ
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 27
సిద్ధవటం మండలం రామకృష్ణాపురం గ్రామ వాసులు వినాయక చవితి పండుగ సందర్భంగా సిద్ధవటం మండలంలోని మాధవరం,-1 రామకృష్ణాపురం గ్రామంలో మంగళవారం ఏర్పాటుచేసిన గణనాధునికి గ్రామానికి చెందిన డేరంగుల వెంకటసుబ్బయ్య, కాణిపాకం లడ్డు13కేజీ, లు సమర్పించి చాటుకున్నారు ఈ సందర్భంగా మంగళవారం కూటమి మండల యువనేత డేరంగుల శ్రీకాంత్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని సేవలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గణేష్ ఉత్సవాల సందర్భంగా పదివేల రూపాయలు విలువ కాణిపాకం లడ్డు ఉత్సవాలకు సమర్పించామని మనము చేసే ప్రతి పనిలో తొలి పూజ విఘ్నేశ్వరునికే చేస్తామని అలాంటి ఉత్సవాల్లో మాకు సేవా కార్యక్రమాలు లభించడం చాలా సంతోషకరమని కమిటీ సభ్యులు కూడా భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు